23.4 C
Hyderabad
Wednesday, November 4, 2026
No menu items!

కాళ్ల పారాణి ఆరనేలేదు..పచ్చని తోరణాలు తీయనేలేదు.. కాని..?

తెలంగాణ సామ్నా బ్యూరో: ఆ జంటకు పెళ్లయి పట్టుమని పదిరోజులు కూడా కాలేదు. వధువు కాళ్లకు రాసిన పారాణి ఇంకా కరిగిపోలేదు. వరునికి చేసిన అలంకరణ ఇంకా చెదిరిపోలేదు. బంధువులు వారి వివాహం గురించి మంచి చెడులు ఇంకా మాట్లాడుకుంటూనే వున్నారు. అంతలోనే వారి దాంపత్యజీవితం విడాకుల వరకు వెళ్లింది. చర్చంచి సభ్యసమాజం నేర్చుకోవాల్సింది ఎంతో వున్న ఈ వివాదస్పద విడాకుల తాలూకూ విషయాలు ఇలా వున్నాయి.

ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కొత్వాలి ప్రాంతంలో జరిగింది. వారిద్ధరికి ఫిబ్రవరి 12 పెళ్లయ్యింది. వరుడు డాక్టర్‌. పెళ్లయి రెండు రోజులు కాకముందే వరకట్నం గురించిన వేధింపులు ఆ నూతన వధువుకు ప్రారంభమయ్యాయి. అత్తమామ వరకట్నం గురించి వేధించడం ప్రారంభించారు. ఆ గొడవ అలా వుండగానే నూతనదంపతులు హనీమున్‌ కోసమని గోవా వెళ్లారు. సరదాగా గడపాల్సిన చోట కూడా కొత్తజంటకు వరకట్నం విషయమై గొడవ జరిగింది. గొడవ అనంతరం తన భర్త కొట్టాడని వధువు కుటుంబానికి ఫోన్‌ ద్వారా తెలిపింది. దీనితో వెంటనే ఇంటికి వచ్చేయమని ఆమె తల్లిదండ్రులు సూచించారు. దానితో తనతో పాటుగా వున్న భర్తకు ఎలాంటి సమాచారము ఇవ్వకుండా ఆ నవవధువు ప్లైట్‌లో ఇంటికి చేరింది.

ఆ తరువాత ఆ కొత్త పెళ్లి కూతురు తన అత్తామామ. భర్తను కలుపుకొని మరో ఐదుగురిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. వరకట్నం విషయమై తనపై బౌతికదాడితో పాటుగా తనను గొంతుకోసి తన భర్త చంపాడని ప్రయత్నించాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు భారత న్యాయ సంహిత చట్టం ప్రకారం వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా సదరు నూతన వధువు తన భర్త నుండి విడాకులు కావాలని పోలీసుల ముందు ప్రాధేయపడిరది.

అతి సున్నితమైన సమస్యను పెంచి పెద్ధదిగా చేసుకొని విడాకుల వరకు తీసుకెళ్లిన ఇరు కుటుంబాల తీరుపట్ల, నూతన వధువరుల ప్రవర్తన పట్ల సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles