23.8 C
Hyderabad
Saturday, October 31, 2026
No menu items!

‘‘పాలు నేలపాలు’’ అయ్యాయని రాహుల్‌ గాంధీపై కేసు

తెలంగాణ సామ్నా బ్యూరో: కాదేదీ కవితకు అనర్హం అనేది పాత సామెత కాని తాజాగా మరో సామెత కూడా వెలుగులోకి వచ్చేట్టు వుంది. అది ‘‘ కాదేదీ కేసుకు అనర్హం’’ అని చెప్పుకునేటట్టు వుంది ఈ సంఘటన.
వివరాల్లోకి వెళితే… బీహర్‌ రాష్ట్రానికి చెందిన ముఖేష్‌ కుమార్‌ అనే పాల వ్యాపారి కాంగ్రెస్‌ ఎంపి రాహుల్‌ గాంధీపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అతను తన ఫిర్యాదులో దేశంలోని ప్రతి వ్యవస్థపై పెత్తనం చేస్తున్న బీజేపి, ఆర్‌ఎస్‌ఎస్‌లపై పోరాడుతున్నాం’’ అని రాహుల్‌ గాంధీ చేసిన వ్యాఖ్యాలతో తాను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యే పరిస్థితి వచ్చిందని ఆయన తన ఫిర్యాదులో పెర్కోన్నాడు. ఆ షాక్‌లో అపుడు తన చేతిలో వున్న పాల డబ్బా కిందపడి అందులో వున్న 5 లీటర్ల పాలు కిందపడి నేలపాలయ్యాయని అని తెలిపాడు. ఇందువల్ల తనకు రూ. 250 నష్టం జరిగిందని తెలుపుతు, తన నష్టానికి కారణమైన రాహుల్‌ గాంధీపై ముకేష్‌కుమార్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
ఈ ఫిర్యాదు పట్ల ప్రజల్లో భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇకపై ఏ నాయకుడు మాట్లాడినా ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం వుందని లేకపోతే కేసులు ఎదుర్కోనే ప్రమాదం వుందని ప్రజల్లో వాదన వినిపిస్తుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles