23.8 C
Hyderabad
Saturday, October 31, 2026
No menu items!

వాంగ్ములం

(నిన్నటి తరువాయి)

గోపాల్‌ గోడ్సే కథనము

గోపాల్‌ గోడ్సేతో కర్కారే మదన్‌లాల్‌తో సహా ఉరిశిక్ష విధింపబడిన ఖైదీలతో గూడ వారు ఉరితీయబడుటకు ఇరవై నిమిషముల ముందు వరకు వుండినాడు. ఇద్దరు కూడా ప్రశాంతముగాను, స్థైర్యముతోను, ఉల్లాసముగాను వుండినారు. తమ మనో నిబ్బరమును నిలబెట్టుకొనుటకు వారు ఎటువంటి ప్రయత్నము చేయవలసినట్టు కనబడలేదు. వారి ముఖములు నిర్మలముగాను, ప్రశాంతముగను వుండినవి. వారు మాట్లాడుతూ, ముచ్చటలాడుతూ వుండినారు. వారిలో వారు, కారాగార అధికార బృందముతో, మాతో మాట్లాడినారు.
మాకు తేనీరు, కాఫీ ఇవ్వబడినది. ఒక సిపాయి, పళ్ళేమెలో కాఫీ తెచ్చినప్పుఉడు నాథూరామ్‌ తన ప్రక్కనే నిలబడియుండిన జైలు ఉన్నత అధికారి, శ్రీ అర్జునదాస్‌ వైపు చూచి చిరునవ్వు నవ్వినాడు.
అర్జున్‌దాస్‌ మాత్రము బదులుగా చిరునవ్వు నవ్వే పరిస్తితిలో లేడు. ఇంకా కొద్ది నిమిషములలలో మరణశిక్ష విధింపబడిన ఈ ఇద్దరిని ఆయన ఉరి తీయించబోవుచున్నాడు. దానిని ఆయన తన దురదృష్టముగ భావించుకొనినాడు.
అంతకుమందు ఆయన వారిద్దరితో స్నేహము పెంచుకొన్నాడు. వారితో కూర్చోని గంటల కొద్ది మాట్లాడేవాడు. ఆనాటి సంఘటనల రాజకీయ పరిజ్ఞానము కలిగినవాడు. జాతి సమైక్యతపై వారి ఉరి ప్రభావములు ఆయనకు బాగా తెలుసు. లేకుంటే, మహారాష్ట్రకు సంబంధించిన ఈ వ్యక్తులు వేయిమైళ్ళకు పైగా దూరములో వుండే అన్య రాష్ట్రము పంజాబు ముక్కలైపోతే, ఎందుకు మానసిక స్థిమితమును కోల్పోవలెను. అక్కడి నుండి సమూలముగా పెకలింపబడి అగ్నిలో దూకిన వారిని గురించి ఎందుకు ఆవేదన చెందవలెను? అని ఆయన ఆలోచించేవాడు.
ఈ కారాగార నిర్వహణాధికారి భారత స్వాతంత్య్ర ఆవతరణలో జరిగిన రక్తపాతమును కండ్లార చూచి యుండినవాడు. ఒక్క బోట్టు నెత్తురు చిందకుండా స్వాతంత్య్రము సంపాదించినామని తరుచుగా మాట్లాడే కపట వర్తనులను ఆయన నిందించే వాడు. ఆయన అనుకొనేవాడు ‘‘పంజాబులో జరిగిన రక్తపాతము ఎవరి లెక్కలో ఖర్చు వ్రాయవలెను’’ అని.
(తరువాయి బాగం రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles