
(నిన్నటి తరువాయి)
గోపాల్‌గోడ్సె నాథూరాం గోడ్సె సోదరుడు. అతను ఈ కేసులో 6వ నిందితుడు. ఇతను కొంతకాలము ఆయుధ కర్మాగార శాఖలో పనిచేసినాడు. ద్వితియ ప్రపంచ సంగ్రామ కాలంలో ఇతను ఇతర దేశములలో పనిచేసి తిరిగి వచ్చి తర్వాత పూణే వద్ద ఖాడ్‌కి డిపోలో నియమింపబడినాడు. ఇతను జనవరి 20వ తేదీ బిర్లా మదిరు వద్ద వుండినందున ఇతనిపై కుట్రనేరము ఆరోపించబడినది. ఇతను వివాహితుడు. ఇద్దరు కుమార్తెలు.
దిగంబర ఖాడ్గె. ఒక హిందూ సంఘటన వాది. ఆయుధముల వ్యాపారము చేయుచుండినాడు. హిందువులను ఆల్ప సంఖ్యాకులుగా నున్న ప్రదేశములలో వారికి ఆయుధములు సమకూర్చి ముస్లింలు దౌర్జన్యము చేసినప్పుడు తిరిగి దెబ్బతీయుటకు తయారుగా వుంచవలెననేది ఇతనికి ఒక దృఢమైన నమ్మకము. మదనలాల్‌చే ప్రేల్చబడిన గన్‌కాటన్‌స్లాబ్‌ను బాడ్గె సమకూర్చినాడనేది నేరారోపకుల వాదన. మదన్‌లాల్ నుండి ఒక విసిరికొట్టే బాంబు కూడా స్వాధీనము చేసుకోబడినది. మరికొంత మందుగుండు సామ్రగ్రి బాడ్గె నుండి వశపరచుకోబడినది. ఇతను కూడా జనవరి 20వ తేది డిల్లీలో నేరస్థలములో వుండినాడు. 8వ నిందితుడు డి.యస్. పర్చూరే ఒక డాక్టరు. గ్వాలియర్‌లో వైద్యవృత్తి చేయుచుండినారు. ఆయన ఒక సమర్థుడన హిందూ సంచాలకుడు. ముస్లింలు దాడి చేసినస్పుడు తిరుగుదాడులతో వారిని ఎదుర్కొనేవాడు. నాథూరాం ఆయన వద్ద నుండి పిస్టల్‌ను సంపాదించుకొనినాడు అని నేరారోపణపై ఇందులో ఇరికించబడినాడు. ఇతని వద్ద నేరమునకు ఒప్పుదలను ఒత్తిడి చేసి తీసుకొనినారు. ఇతనికి వివాహమైనది. తన కుటుంబముతో సొంత ఇంటిలో వుటూ వుండినాడు.
