హైదరాబాదులోని మూసీ నదిని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దేందుకే ప్రభుత్వం ప్రక్షాళన చేపడుతుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన జిల్లా కేంద్రంలో మాట్లాడుతూ మూసీ నది ప్రక్షాళన అవశ్యకత తెలిపేందుకే సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తున్నారని తెలిపారు. ఏ పార్టీ కూడా ఎవరైనా లక్ష్యాలను వ్యతిరేకించడం లేదని కేవలం నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయమే అడుగుతున్నారని ఆయన అన్నారు
