చట్టం ముందు అందరూ సమానమేనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరూపించాల్సిన సమయం ఆసన్నమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. జన్వాడ లో బావమరిది ఫామ్ హౌస్ లో రేవు పార్టీలు జరిగినట్టు వస్తున్న వార్తల నేపథ్యంలో బండి సంజయ్ ఈ హాట్ కామెంట్ చేశారు. కాంగ్రెస్ డిఆర్ఎస్ కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తూ ఉండడం సిగ్గుచేటని ఆయన అన్నారు. డ్రగ్స్ తీసుకుంటూ అడ్డంగా దొరికిన బుకాయి ఇస్తారేమో అని విమర్శించారు. జన్వాడ ఫామ్ హౌస్ లో ఎవరెవరు ఉన్నారు ఏమి జరిగింది అన్నదానిపై పూర్తి వివరాలు ప్రజలకు తెలుపాల్సిన అవసరం ఉందన్న వాదనలు వస్తున్నాయి.
