హైదరాబాద్ ఇందిరా పార్క్ సమీపంలో ఉన్న ధర్నా చౌక్ వద్ద తెలంగాణ బిజెపి రాష్ట్ర శాఖ మహా ధర్నా చేపట్టింది. హైడ్రాకు వ్యతిరేకంగా మూసి పునర్జీవనం పేరున చేస్తున్న అక్రమాలకు వ్యతిరేకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ ధర్నా జరుగుతుంది. ఈ ధర్నాలో బిజెపి తెలంగాణ రాష్ట్ర ఎంపీలు ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పాల్గొన్నారు. మూసి అభివృద్ధి పేరు మీద పరివాహక ప్రాంతంలోని ఇళ్లను కూల్చవద్దని బిజెపి నేతలు కొద్ది రోజులుగా డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే.
