బంగ్లాదేశ్ నుండి వలస వచ్చే ప్రజలకు తమ రాష్ట్రంలో ఆశ్రయం కల్పిస్తామని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలను కేంద్రం ఖండించింది. ఈ విషయం కేంద్రం పరిధిలోనిది అని రాష్ట్ర ప్రభుత్వాలకు ఎలాంటి అధికారం ఉండదని తేల్చి చెప్పింది. మీ వ్యాఖ్యలు అసంబద్ధంగా ఉన్నాయని స్పష్టం చేసింది.
