35.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

కోరుట్ల నియోజకవర్గంలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

(బాలె అజయ్ 9290277727) (తెలంగాణ సామ్నా)

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశభక్తి వాతావరణంలో ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా మెట్‌పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మరియు కోరుట్ల పట్టణాల్లోని ఎమ్మార్వో, ఆర్డిఓ కార్యాలయాలు, పురపాలక సంఘాలు, కోర్టులు, పోలీస్ స్టేషన్లు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రివర్ణ పతాకాన్ని అధికారులు ఘనంగా ఆవిష్కరించారు.
అలాగే ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థినీ విద్యార్థులతో కలిసి త్రివర్ణ పతాకాలను చేత పట్టుకొని ర్యాలీలు నిర్వహించారు. దేశభక్తి నినాదాలతో పట్టణాలు మార్మోగాయి.
పట్టణాలతో పాటు గ్రామాల్లోనూ గణతంత్ర దినోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా వివిధ కుల సంఘాలు, కార్మిక యూనియన్లు, ప్రతి వార్డులోని ప్రజలు జాతీయ పండుగను ఉత్సాహంగా జరుపుకున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles