ఆర్ఎస్ఎస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచార మాధ్యమాల్లో వార్తలు జోరందుకున్నాయి. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరు కూడా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనకూడదని గతంలోని కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో వాటిని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనవచ్చని ఆ ఉత్తరంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ ఉత్తర్వుల ద్వారా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్న స్వయం సేవకులకు పెద్ద ఊరట ఇచ్చినట్టుగా అయింది.
