(బాలే అజయ్ – 9290277727)
(తెలంగాణ సామ్నా, కోరుట్ల)
ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 56 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కోరుట్లలో ఘనంగా నివాళులు అర్పించారు.
వాసవి, సీనియర్ సిటిజెన్, వనిత క్లబ్‌ల ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి తీపి పంపిణీ చేశారు. వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజల దాహాన్ని తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేసి చల్లని నీరు, మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ ఆంధ్ర రాష్ట్ర అవతరణలో ఆయన పాత్రను గుర్తు చేసుకున్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు వొజ్జెల వెంకటరమణ, ఎలుగూరి భాగ్య, కొత్త గణేష్, పట్టణ ఆర్యవైశ్య సంఘం ఉపాధ్యక్షుడు చిటిమెళ్లి రంజిత్, సంఘ నాయకులు శ్రీపతి పరమేశ్, లింగరాజు, శ్యాంసుందర్, శక్కరి అశోక్, వెంకటేశ్వర్లు, గౌతమి, మాధవి, మౌనిక తదితరులు పాల్గొన్నారు.
