28.6 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

శ్రీ సరస్వతీ శిశు మందిర్‌ భవన నిర్మాణానికి కోరుట్ల ఎమ్మేల్యే భూమిపూజ

తెలంగాణ సామ్నా:జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్‌ మేజర్‌ గ్రామ పంచాయితిలో శ్రీ సరస్వతి శిశు మందిర్‌ సాఠశాల భవనానికి కోరుట్ల ఎమ్మేల్యే కల్లకుంట్ల సంజయ్‌ కుమార్‌ గురువారం భూమిపూజ చేశారు. బారాస ఎంపి సురేష్‌ రెడ్డి ఎంపి నిధుల నుండి 7 లక్షల రుపాయలు స్కూలు భవనానికి నిధులు మంజూరి చేశారు. ఈ నేపథ్యంలో స్థానిక ఎమ్మేల్యే సంజయ్‌కుమార్‌ భవన నిర్మాణానికి శంఖు స్థాపన చేశారు. ఈ సందర్భంగా సరస్వతి విద్యాపీఠం వారికి ఎమ్మేల్యే అభినందనలు అందజేశారు. ఉన్నత విద్యాప్రమాణాలు, చిన్ననాటి నుండి విద్యార్థులకు క్రమశిక్షణతో పాటు దేశభక్తి భోదించే సరస్వతి శిశుమందిరాలు మరింత ఉన్నతంగా ఎదగడానికి తనవంతు సహయం చేస్తానని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో డా. వేముల ప్రభాకర్‌, కమలాకర్‌రావ్‌, డాం.అంబల్ల సుదర్శన్‌, చెట్‌పల్లి శంకర్‌, విద్యాపీఠం బాధ్యులు, గ్రామ పెద్దలు, బారాస మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles