
(బాలే అజయ్ – 9290277727, కోరుట్ల)
అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక శ్రీ సరస్వతి శిశు మందిరం పాఠశాలలో ఆదివారం యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు ఉత్సాహంగా యోగాసనాలు, ధ్యాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
కార్యక్రమంలో ప్రముఖ యోగా మాస్టర్, పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు అనిల్ వివిధ రకాల యోగాసనాలను ప్రదర్శించి, వాటి ఆరోగ్య ప్రయోజనాలను వివరించారు. అలాగే విద్యార్థులతో ధ్యానం చేయించి యోగా ద్వారా శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగాను భాగంగా చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రబంధకారిణి కార్యదర్శి వనపర్తి చంద్రమోహన్, ప్రధానోపాధ్యాయులు గోపు వెంకటేష్, విశ్రాంత అధ్యాపకులు జుంబర్తి శంకరయ్య, యోగా ఆచార్యులు లింగారెడ్డి, మహిళా వ్యాయామ ఉపాధ్యాయురాలు సుమతి, ఆచార్య బృందం మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
