
తెలంగాణ సామ్న: ఈ ఫార్మా కార్ రేస్‌లో విదేశీ కంపనీకి నిబంధనలకు విరుద్ధంగా నిధులు తరలించారనే ఏసిబి అభియోగంలో బాధ్యులైన అధికారులందరు తమకు ఏం సంబంధం లేదు అంతా కేటిఆర్ ఎలా చేబితే అలా చేశాం అనే
మాట చెబుతున్నట్లు ప్రచారం జరుగుతున్నది. ఈ మేరకు బుధవారం ఐఎఎస్ అధికారి దాన కిషోర్ వాంగ్మూలాన్ని పోలీసులు
రికార్డు చేశారు. ఈ సందర్భంగా దాన కిషోర్ తెలంగాణ పురపాలక శాఖతో ఫార్ములా ఈ ఆపరేషన్స్ లిమిటెడ్ మధ్య జరిగిన ఎంఓయు వివరాలు అందులో ఏయే ఆంశాలలో ఒప్పంద ఉల్లంఘన జరిగిందనే విషయంపై దాన కిషోర్ నుండి ఏసిబి
అధికారులు వివరాలు సేకరించినట్లు సమాచారం.
ఈ వివరాలతో పాటుగా 46 కోట్ల రుపాయల పౌండ్లను ఐఓబి హిమయత్‌నగర్ బ్రాంచి నుండి విడుదల సందర్భంగా సమర్పించిన డాక్యుమెంట్లను జిఓ పత్రాలను కూడా ఏసిబి పరిశీలించనున్నట్లు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో ఐఎఎస్ అధికారి
అర్వింద్ కుమార్ నిధుల మళ్లింపు వ్యవహరంలో తనదేమీ తప్పు లేదని అంతా కేటిఆర్ ఎలా చెబితే అలా నడుచుకున్నామని పై అధికారులకు చెప్పి అప్రూవర్‌గా వుండడానికి సిద్ధంగా వున్నట్లు సమాచారం అందుతున్నది.
మొత్తానికి నూతన సంవత్సరం మొదటి వారంలోనే కారు రేస్ వ్యవహరం 360 కిమీల వేగంతో దూసుకుపోయి కేటిఆర్ కార్‌ను డీకొట్టి డ్యామేజీ చేసేటట్టు వుందని రాజకీయ విశ్లేషణలు వస్తున్నాయి.
