(బాలే అజయ్ కోరుట్ల)
రాబోయే మొహర్రం పండుగను నిర్వహించే విషయంపై కోరుట్ల సర్కిల్ పోలీసులు పీరీల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు.
మొహర్రం ను 27వ తేదీనే నిర్వహించాలని ఈ సందర్భంగా కోరుట్ల సీఐ కె. లక్ష్మీనారాయణ సూచించారు.
కొన్ని గ్రామాల్లో 16 వ తేదీన పండగ చేసుకుంటున్నట్లు సమాచారం ఉందని సిఐ తెలిపారు. అందుకే పండగ నిర్వహణపై అపోహలను తొలగించడానికి సమావేశం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
హిందూ ముస్లింలు.సోదర భావంతో పండగ నిర్వహించుకోవాలని ఆయన కమిటీ సభ్యులకు తెలిపారు.
అలాగే పండుగ సందర్భంగా శాంతి భద్రతల పరిరక్షణకు అందరూ సహకరించాలని అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్సై చిరంజీవి పాల్గొన్నారు
