(బాలే అజయ్ – 9290277727, పెగడపల్లి)
ఇటీవల కురిసిన భారీ గాలివానలు, వర్షాల కారణంగా నష్టపోయిన ఓ నిరుపేద కుటుంబానికి లయన్స్ క్లబ్ జగిత్యాల సభ్యులు చేయూతనందించారు.
పెగడపల్లి మండల కేంద్రానికి చెందిన బొమ్మేన శాంతమ్మకు చెందిన రేకుల షెడ్డు గాలివాన ధాటికి పూర్తిగా దెబ్బతినడంతో ఆమె కుటుంబం ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం తెలుసుకున్న లయన్స్ క్లబ్ సభ్యులు స్పందించారు. లయన్ డా. బత్తుల ప్రదీప్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ జగిత్యాల తరఫున బాధిత కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు మాట్లాడుతూ, ఆపదలో ఉన్నవారికి అండగా నిలవడం లయన్స్ క్లబ్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సమాజ సేవా కార్యక్రమాలను భవిష్యత్తులో కూడా కొనసాగిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జగిత్యాల అధ్యక్షుడు లయన్ వడ్లగట్ట శంకర్, లయన్ గుండేటి గంగాధర్, లయన్ కొమ్మినేని మల్లేశం, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
