( బాలే అజయ్ 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన కోటపోచయ్య అనే వ్యక్తి ఇంటిపై మత ప్రచారం చేస్తున్నాడు అన్న విషయంపై ఆయన ఇంటిలోకి అక్రమంగా చొరబడి ప్రార్థనలు ఆపిన 16 మందిపై కేసు నమోదు చేసినట్లు కోరుట్ల ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
పోచయ్య అనే వ్యక్తి సుమారు 20 సంవత్సరాల క్రితం హిందూ ధర్మాన్ని వీడి క్రిస్టియన్ మతంలోకి మారినాడు. ఈ క్రమంలో గురువారం వారి ఇంట్లో కుటుంబ సభ్యులు మరియు వారి బంధువులు అందరి సమక్షంలో పాస్టర్ గారితో ప్రార్థనలు చేస్తుండగా కొంతమంది బిజెపి కార్యకర్తలు అక్రమంగా వాళ్ళ ఇంట్లోకి ప్రవేశించి ప్రార్థనలు ఆపారని పోచయ్య ఫిర్యాదు చేశాడు.
పోచయ్య ఫిర్యాదు మేరకు ప్రాథమిక విచారణ చేసి ఆ ఇంటిపై దాడికి వెళ్లిన 16 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు
