( బాలే అజయ్, కోరుట్ల)
కోరుట్ల పట్టణంలో నీ అలమయ్య గుట్ట ప్రాంతంలో అర్ధరాత్రి కొంతమంది పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు కోరుట్ల ఎస్ఐ మరియు వారి సిబ్బంది అట్టి స్థావరంపై దాడి చేసారు.ఆ సందర్భంగా అక్కడ పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి 20500/- అమౌంట్ మరియు ఏడు సెల్ ఫోన్లు మరియు ఏడు బైకులను స్వాధీన పరుచుకున్నారు. వారిపై కేసు నమోదు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చిరంజీవి తెలిపారు
