జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత బస్టాండ్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. పారిశుద్ధ విధులు నిర్వహిస్తున్న పురపాలక కార్మికులు ఆరుగురికి ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలయ్యాయి. బోధన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మున్సిపల్ ట్రాక్టర్ను ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని జగిత్యాల ఏరియా ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు
