(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలం కట్లకుంట గ్రామానికి చెందిన గుండంపల్లి శంకర్ (42) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
శంకర్ తండ్రి గంగరాజు, కులం ఎస్సీ (మాల). కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం, శంకర్ గత ఏడాది నుండి మద్యానికి బానిసైనట్లు తెలిపారు. ఈ నెల 13-02-2026 ఉదయం సుమారు 6 గంటల సమయంలో మెట్పల్లిలోని తన అత్తగారి ఇంటి నుంచి “కట్లకుంట గ్రామానికి వెళ్తున్నాను” అని చెప్పి బయటకు వెళ్లినట్లు సమాచారం. అయితే, ఆయన గ్రామానికి చేరుకోకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు.
బంధువులు, గ్రామస్తులు చుట్టుపక్కల ప్రాంతాల్లో, బంధువుల ఇళ్లలో వెతికినా శంకర్ ఆచూకీ లభించలేదు. ఇదిలా ఉండగా, నిన్న రాత్రి కోరుట్ల పట్టణ శివారులోని డి-40 కాలువ సమీపంలోని ఒక వ్యవసాయ బావిలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.
తదుపరి మృతుడి బంధువులకు సమాచారం అందించగా, ఈ రోజు వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి, అది గుండంపల్లి శంకర్‌దేనని నిర్ధారించారు. మృతుని తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
శంకర్ మృతి ఆత్మహత్యా? ప్రమాదవశాత్తు బావిలో పడిపోయాడా? లేక మరేదైనా అనుమానాస్పద కారణాలున్నాయా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నట్లు ఎస్ఐ చిరంజీవి తెలిపారు.
