37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

కోరుట్లలో పోలీసుల సుడిగాలి తనిఖీలు – డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన హెచ్చరికలు

(బాలే అజయ్ – 9290277727)

జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు కోరుట్ల పట్టణంలో సాయంత్రం వేళ పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఐలాపూర్ రోడ్డులోని రైల్వే బ్రిడ్జి వద్ద ఎస్ఐ చిరంజీవి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ తనిఖీల్లో వాహనదారులను ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్ డిటెక్షన్ యంత్రంతో పరీక్షలు నిర్వహించారు.
మద్యం సేవించి వాహనాలు నడపకూడదని పోలీసులు కఠినంగా హెచ్చరించగా, హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్నవారు మరియు సరైన పత్రాలు లేని వారికి జరిమానాలు విధించారు. ఈ తనిఖీల ద్వారా ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించడమే ప్రధాన లక్ష్యం అని పోలీసులు తెలిపారు.
ఈ సందర్భంగా ఎస్ఐ చిరంజీవి మాట్లాడుతూ, “ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని. ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి” అని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఐ ఎమ్.డి అదిముద్దీన్, హెడ్ కానిస్టేబుల్ అవుదుర్తి తిరుపతి, కానిస్టేబుల్ ఎల్. సంజీవ్ తదితర సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles