బాలే అజయ్ – 9290277727)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. నమ్మదగిన సమాచారం మేరకు ఎస్సై చిరంజీవి తన పోలీస్ సిబ్బందితో మాదాపూర్ ఎక్స్ రోడ్ వద్ద పంచుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారిని తునికి రాకేష్ (మోతే గ్రామం, జగిత్యాల రూరల్ మండలం), అంతేనా మధు (మోతే గ్రామం, జగిత్యాల రూరల్ మండలం)గా గుర్తించారు. వారి వద్ద నుంచి గంజాయి, రెండు సెల్ ఫోన్లు మరియు ఒక స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కోరుట్ల పట్టణానికి చెందిన పూసల వెంకటేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుండి గంజాయి తెచ్చి వీరికి సరఫరా చేస్తున్నట్లు రాకేష్, మధు వెల్లడించారు. వెంటనే పోలీసులు పూసల వెంకటేష్‌ను కూడా అదుపులోకి తీసుకుని, అతని వద్ద నుంచి మరికొంత గంజాయి మరియు ఒక సెల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
మొత్తంగా ఈ ముగ్గురు వ్యక్తుల వద్ద నుండి సుమారు రూ. 2000 విలువ గల 65 గ్రాముల గంజాయి, మూడు సెల్ ఫోన్లు మరియు ఒక ద్విచక్ర వాహనం (స్కూటీ) ని పోలీసులు సీజ్ చేశారు. ఈ ఘటనపై ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా కోరుట్ల ఎస్ఐ చిరంజీవి హెచ్చరిస్తూ, గంజాయి వినియోగం, విక్రయం, రవాణా వంటి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొనేవారిపై భవిష్యత్తులో చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
