
తెలంగాణ సామ్నా: కేటిఆర్‌ను నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఆలోచిస్తుందన్న వాదనలు వస్తున్నాయి. అయితే డిసెంబర్ 31 వరకు అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఎసిబిని ఆదేశించింది. దీనితో కేటిఆర్‌కు కొంత ఊరట దొరికిసట్లయ్యింది. తనపై ఎసిబి దాఖలు చేసిన పిటిషన్ కేవలం రాజకీయ కుట్ర అని అందులో ఏమీ లేదని, ఈ కేసును కొట్టివేయాలని కేటిఆర్ క్వాష్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కేసును 31 రోజున వాదనలు వింటామని అంతవరకు కేటిఆర్‌ను అరెస్ట్ చేయవద్దని ఎసిబిని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టులో పరిస్థితి అలా వుంటే ఎసిబి మటుకు కేటిఆర్ మీత 409 సెక్షన్ కింద కేసు ఫైల్ చేసింది. దీనితో నోటీసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడానికి ఏసిబి అవకాశం వుంటుంది. అయితే కేటిఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టు తీర్పు వరకు వేచిచూసే దోరణిలో ఎసిబి వున్నట్లు తెలుస్తున్నది.
ప్రభుత్వ సొమ్మును దురుద్శేశ్యంతో నే బదిలీ చేశారని ఏసిబి కోర్టులో వాదిస్తున్నది. ఈ మేరకు కౌంటర్ అఫిడవిట్ కోర్టుకు సమర్పించిన నేపథ్యంలో కోర్టు 31 నాడు తీర్పు వచ్చిన క్షణమే ఏసిబి తన చర్యలు ప్రారంభించవచ్చు అనే వాదనలు వస్తున్నాయి.
