28.6 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

ఇంకా తేలని ‘‘ట్రయాంగిల్‌ ఆత్మహత్యల స్టోరీ’’ వ్యవహరం?

తెలంగాణ సామ్నా: కామారెడ్డి జిల్లా బిక్కునూర్‌లో కొద్ది రోజుల క్రితం ఆత్మహత్యలు చేసుకున్న ముగ్గురికి
సంబంధించిన కేసు ఇంకా పరిష్కారం కానట్టుగా తెలియవస్తున్నది. జిల్లా ఎస్పీ సింధుశర్మ అన్ని కోణాలలో ఈ
కేసును పరిష్కరించేదిశగా ప్రయత్నాలు చేస్తున్నది. ఒక విచారణ అధికారిని నియమించి కేసును పరిశీలిస్తున్నారు.
స్థానికంగా ఈ కేసుకు సంబంధించిన వ్యవహరంలో ప్రజలు ఆచితూచి మాట్లాడుతున్నారు. ఓ స్థాయి బాధ్యత కలిగిన
పోలీస్‌ అధికారి ఆత్మహత్యలు చేసుకున్న వారిలో ఒకరు కావడంతో పోలీసులు కూడా ఆత్మహత్య తాలూక ప్రభావం శాఖపై ఏ మేరకు వుండబోతుంది అనే కోణంలో ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ కేసుకు సంబంధించి వినవస్తున్న వార్తల్లో ముఖ్యంగా ఈ ఆత్మహత్యలు ‘‘ట్రయాంగిల్‌ లవ్‌ స్టోరి’’ అనే విషయమే అంచనాలకు దగ్గరగా వుందన్న వాదన వస్తున్నది. ముగ్గురి కాల్‌డేటాను పరిశీలించిన తరువాత ఈ విషయంపై పోలీసులు స్పష్టమైన ఆలోచనకు వచ్చిన తరువాతే ఈ ఆత్మహత్యలు ఎలా జరిగాయని తెలిపే అవకాశం వుందన్న వాదన వినవస్తున్నది.
ఇక వద్దు వదిలేయమని ఒకరు, వదలను అని ఒకరు, వదిలేద్దాం ఎవరి బ్రతుకు వారు బ్రతుకుదాం అని మరోకరు అనే చర్చ వికటించి ఆవేశాలకు పోయి అత్మహత్యలకు దారి తీసిందనే చర్చ స్థానికంగా నడుస్తున్నది.
ఊహాగానాలు ఎక్కువ, వాస్తవాలు తక్కువ వున్న ఈ కేసులో పోలీసులు కేసుకు సంబంధించిన అసలు విషయాన్ని చెప్పకముందే ప్రజలు వేస్తున్న అంచానాలు ఏ మేరకు నిజమో రెండు రోజుల్లో తేలనున్నట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles