(బాలే అజయ్ – 9290277727 | కోరుట్ల)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని అర్బన్ కాలనీలో తెలంగాణ విగ్రహం సమీపంలో ఉన్న కమిటీ హాల్ అభివృద్ధి పనుల కోసం నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ ఎంపీ నిధుల నుంచి రూ.3 లక్షలు మంజూరు చేశారు.
ఈ నిధులకు సంబంధించిన మంజూరు పత్రాన్ని శుక్రవారం ఉదయం 11 గంటలకు కమిటీ హాల్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, గుద్దేటి రాజేందర్ తదితరులు 7వ వార్డు కౌన్సిలర్ గూగులవత్ శ్రీకాంత్ సమక్షంలో కాలనీ ప్రజలకు అందజేశారు.
ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. కోరుట్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, ప్రతి వార్డుతో పాటు కమ్యూనిటీ హాళ్లు, కుల సంఘాలు, దేవాలయాల అభివృద్ధికి ఎంపీ నిధుల ద్వారా నిధులు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. రానున్న రోజుల్లో కూడా మరిన్ని అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
కమిటీ హాల్ అభివృద్ధికి ఎంపీ నిధులు మంజూరు కావడంపై కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ నిధులతో కమిటీ హాల్‌ను మరింత అభివృద్ధి చేసి, కాలనీ ప్రజలకు ఉపయోగకరంగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరి బాబు, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు డాక్టర్ అనూప్ రావు, బీజేపీ రాష్ట్ర నాయకుడు రుద్ర శ్రీనివాస్, కోరుట్ల పట్టణ అధ్యక్షుడు కస్తూరి లక్ష్మీనారాయణ, కౌన్సిలర్లు తిరుమల వాసు, ధార్మిక సెల్ జిల్లా కన్వీనర్ మాడవేణి నరేష్, పట్టణ ప్రధాన కార్యదర్శి చెట్లపెల్లి సాగర్, ఉపాధ్యక్షుడు మైదం సత్యనారాయణ, పట్టణ కార్యదర్శులు చెట్లపెల్లి ఓంప్రకాష్, రాధారపు సత్యనారాయణ, బాల్క ప్రేమ్ సాగర్, జిల్లా కార్యవర్గ సభ్యుడు గిన్నెల శ్రీకాంత్, యువ మోర్చా అధ్యక్షుడు ధమ్మా సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

