
(బాలే అజయ్,కోరుట్ల, 9290277727)
ఉత్తర తెలంగాణ జిల్లాలో అతిపెద్ద బోనాల పండుగగా ప్రఖ్యాతి చెందిన మెట్పల్లి మండలం పెద్దాపూర్ మల్లన్న జాతర వైభవంగా కొనసాగింది. వేలాది మంది భక్తులు పాల్గొని మల్లన్న స్వామికి బోనాలు మొక్కులు సమర్పించారు. ఆలయ పరిసర ప్రాంతతో పాటుగా పెద్దాపూర్ గ్రామం మొత్తంగా శివశక్తుల పూనకాలతో మార్మోగింది. బోనాలను చూసేందుకు చుట్టుప్రక్కల ప్రాంతాల నుండి కాక ఇతర జిల్లాలతో పాటుగా ఇతర రాష్ట్రాల్లోనీ భక్తులు కూడా భారీగా తరలివచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా దేవాలయ కమిటీ సౌకర్యాలు ఏర్పాటు చేసింది.
