
తెలంగాణ సామ్నా: హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీ పెరగడం మాట అటుంచుతే ప్రపంచ వ్యాప్తంగా తెలంగాణ పరువు 60 కోట్ల కు ఫణంగా పెట్టిన పరిస్థితి దాపురించింది అనే విమర్శలు గత ప్రభుత్వాధికారులపై, కేటిఆర్‌పై పుంఖానుపుంఖాలుగా వస్తున్నాయి. కార్ రేసు పెడితే వందలకోట్ల రుపాయల లాభం ఎవరికి వచ్చిందో? ఎలా వచ్చిందో? ఏం తెచ్చిందో తెలియదు కాని కోర్టుల చుట్టు , ఈడీల చుట్టు పోలీసుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఏర్పడిరదన్న వాదన బలంగా వస్తున్నది. ఇది ఏ ముగ్గురి వ్యక్తిగత సమస్య కాదని తెలంగాణ బ్రాండ్ ఇమేజీకి సంబంధించిన ఆంశం కాబట్టి ఖచ్చితంగా ఫార్ముల ఈ కార్ రేస్‌లో ఎవరు దోషులో ఖచ్చితంగా తేల్చి శిక్ష వేయాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
ఇక రేసు కార్ల గురించి చెప్పేది ఏముంది? ఈ రేసులో కార్ల కంటే వేగంగా అప్పటి పురపాలక శాఖ మంత్రిగా వున్న కేటిఆర్, అధికారులు పరిగెత్తి పరిగెత్తి ఎఫ్‌ఈవోకు డబ్బులు చెల్లించాలరనే అభియోగం సూటిగా వెళ్లి డివైడర్‌ను గుద్ధుకొని పల్టీలు కొట్టుకుంటు వెళ్లి ఏసిబి, ఈడీ ఫైళ్లలో ఇరుకుందంట!
అసలు తమకు సంబంధమే లేని హెచ్‌ఎండిఏ ఎలా 46 కోట్లు చెల్లించిందనే విషయం సామాన్యునికి ఆర్థం కాక తలపట్టుకు కూర్చున్నాడట. ఇక ఈడీ వారో ఏసిబి వారో చెబితే విందామన్న ఆలోచనలు సామాన్య తెలంగాణ ప్రజలు చేస్తున్నారట!
పూల వ్యాపారం చేసే వారు కనిపిస్తారు కాని వాడిపోయి పనికి రాకుండా పోయి పడేయ్యాలనుకున్న పూలతో వ్యాపారం చేయాలని ఎవరు అనుకోరు కదా? మరి నష్టపోయి పక్కకు తప్పుకున్న ఏస్ నెక్స్ట్ జెన్ నష్టం వస్తుందని తప్పుకున్న తరువాత తమకు సంబంధం లేకపోయిన ఆ బరువు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు తలపై పెట్టుకుంది? అనేది తెలంగాణ సామాన్య ప్రజలకు ఇంకా ఆర్థం కావడం లేదని అంటున్నారు! దీనిక వెనక ‘‘సినిమా’’ ట్రిక్ ఎమైనా వుందా? అనే గుసగుసలు వస్తున్నాయి.
క్యాబినెట్ ఆమోద ముద్ర లేదు. ఆర్థికశాఖ అనుమతి లేదు. ఆర్‌బిఐ అనుమతి జాంతానయి, అన్నట్టుగా ప్రవర్తించి నిబంధనలు అన్ని కాలి కిందేసి తొక్కేసిన వ్యక్తులు ఏవరు? ఇందుకోసం ఎవరైనా‘‘తేనే పూసిన వల’’ విసిరారా? అని చాలా మంది చెవులు కొరుక్కునే పరిస్థితి వచ్చిందట! తెలంగాణ ప్రజల్లో సహజంగా వస్తున్న అనుమానాలు ఏలా నివృత్తి కావాలి? ఎప్పుడు కావాలి? ఎవరు చేయాలి? అనే ప్రశ్న వస్తున్నది.
