(నిన్నటి తరువాయి)
- దీనికి కొంచెము తర్వాతనే పంజాబులోను, భారతదేశంలోని ఇతర ప్రాంతాలలోను మహ్మదీయుల మతావేశ పూరిత తీవ్ర దైర్జన్యాలు చెలరేగినవి. కాంగ్రెసు ప్రభుత్వం మాత్రం బీహారు, కలకత్తా, పంజాబు మొదలగు ప్రదేశములలో ముస్లిం శక్తును ఎదిరించ సాహసించిన హిందువులను, కేసులపెట్టి, వేధించి, తుపాకిగుండ్లు కురిపించి అణచివేయసాగింది. మేవేఉ దేనిని గూర్చి భపగినామో ఆ భయము నిజమయ్యే పరిస్థితులు ఏర్పడసాగినవి. ఇ ట్టి స్థితిలో ఒక వైపు ముస్లింలు పంజాబు నంతటిని అగ్నిజ్వాలలు రేపి దగ్దము చేస్తూ హిందువుల రక్తాన్ని నదులుగా ప్రవహింపచేస్తూ వుంటే, 1947 అగస్టు 12వ తేదికి దీపాంలంకరణములతో జరుపుకోవడం ఎంతో అవమానకరముగ, బాధాకరముగ నుండినది! నా ఆలోచనా ధోరణిగల హిందూ మహాసభవాదులు, ఈ ఉత్సవములను, కాంగ్రెసు పాలనను బహిష్కరించి ముస్లిం దౌర్జన్యాలను ఎదుర్కొనుటకకు ఒక పోరాటపు పంథాను ప్రారంభించినాము.
41, 1947 ఆగస్టు 9తేదీ ప్రాంతంలో అఖిల బారత హిందూ మహాసభ కార్యవర్గసభ, అఖిల భారత హిందూ సమావేశము డిల్లీలో జరుపబడనవి. వీరసావర్కరు అధ్యక్షత వహించినారు. ఆప్టే ఇతర స్నేహితులు, నేను, మహాసభను, దాని ప్రముఖ నాయకులు వీర సావర్కరు, యల్.బి. లోపట్కరు, డాక్టరు ముఖరీజ మొదలగువారిని మా మార్గములోనికి తెచ్చుకొని పోరాట పంథాలో తీర్మానములు చేయించుటకు అఖరు ప్రయత్నములు చేయదలచినాము. మైదరాబాదు నిజామునకు వ్యతిరేకముగ పోరాటము నడుపుటకు ఒక సమితిని ఏర్పాటు చేయవలసినదిగాఉ, లేక విభక్త భారతదేశముపై అధికారము వహించబోవు కాంగ్రెసు ప్రభుత్వాన్ని బహిష్కరించుటకు గాని మేమే చేసి సూచనలను మహాసభ కార్యవర్గము ఆమోదించలేదు. నా ఉద్ధేశ్యంలో పవిభజిత భారత రాష్ట్రాన్ని గురించి అంగీకరించడం ఆ పాపిష్టి విభజనకు భాగస్వాములము కావడమే. మహాసభ మాత్రము 1947 ఆగస్ఠు 15 వేదిన ప్రజలందరు తమ ఇండ్లపై భగవాధ్వజమును ప్రతిష్టంచవలసినదిగా కోరుతూ ఒక నిస్సారమైన తీర్మానమును మాత్రము చేసినది. వీరసావర్కరు ఇంకా ముందుకు పోయి చక్రాంకితమైన త్రివర్ణ పతాకమను జాతీయ తాకముగా గుర్తింపవలసినదిగా పట్టుపట్టినాడు. ఆయన అభిప్రాయములపైస మేము బహిరంగముగ మా ఆగ్రమయును వ్యక్తము చేసినాము.
- ఇంతేకాదు. 1947 ఆగస్టు 15తేది వీరసావర్కరు తన ఇంటిపై భగవా జండాతో బాటు, జాతీయ సతాకముగా చక్రాంకిత త్రివర్ణ పతాకమును కూడా హిందూ సంఘటనావాదులలో అత్యధికుల అభ్టీఉనకు వ్యతిరేకముగా ఎగురవేసినారు. దీనికితోడు, డాక్టరు ముఖర్జీ ఫోనులో, భారత ప్రభుత్వ మంత్రిమండలిలో చేరుటకు వీరసావర్కరు అనుమతి కోరగా, కొత్త భారత ప్రభుత్వమనకు ఒ క వేరే పక్షము నాయకత్వము వహించినప్పటికి, దానిని జాతీయ ప్రభుత్వము కింద గుర్తించి ప్రతి దేశభక్తునిచే బలపరుచవలసియున్నది. కావున, దానిలో మంత్రిత్వ బాధ్యతను స్వీకరించవలసినదిగా కోరబడినప్పుడు హిందూ సంఘటనవాదులు దానిని అంగీకరించి, ఆ జాతాయ ప్రభుత్వమనుకు పూర్తి సహకారము అందజేయవలసినదేనని నిర్ద్వంద్వముగ సమాధానము ఇచ్చినారు. ఇంకా డాక్టరు ముఖర్జీ వంటి హిందూ మహసభ నాయకుని జాతీయ మంత్రి మండలిలోనికి ఆహ్వానించుటలో కాంగ్రెసు వారు చూపిన సమన్వయ వైఖరిని అభినందించినారు. భోపట్కరు కూడా డాక్టరు ముఖర్జీని బలపరచినారు.
(తరువాయి బాగం రేపు)
