(అల్లే సంతోష్, కథలాపూర్)
చింతకుంట గ్రామంలో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యూనియన్ ప్రెసిడెంట్ మరుపాక బక్కన్న ఆధ్వర్యం వహించారు.
ఈ వేడుకల్లో కుక్కదువా గంగాధర్, చిన్నోడు సతీష్, నరేష్, శ్రీకాంత్, వినోద్, అను గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. అలాగే గ్రామ సర్పంచులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ఉపసర్పంచ్లు మరియు ఇతర ప్రజాప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా డ్రైవర్లు తమ హక్కులు, సంక్షేమంపై చర్చిస్తూ, ఐక్యతను ప్రదర్శించారు. కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుకల పట్ల డ్రైవర్లు ఆనందం వ్యక్తం చేశారు.
