(బాలే అజయ్ – 9290277727)
ఆదివారం ప్రకటించిన ఇంటర్ పరీక్షల ఫలితాలలో జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన గుడిసె హాసిని ఎంపీసీ విభాగంలో 467 మార్కులు సాధించి ప్రతిభ చాటింది.
ఈ సందర్భంగా వాసవి గ్రేటర్ క్లబ్ కోరుట్ల ఆధ్వర్యంలో హాసినిని ఘనంగా సత్కరించారు. క్లబ్ అధ్యక్షులు ఓజ్జల వెంకటరమణ శాలువా కప్పి ఆమెను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పట్టుదలతో చదివితే ఏ లక్ష్యాన్నైనా సాధించవచ్చని పేర్కొన్నారు. హాసిని సాధించిన విజయాన్ని ఆదర్శంగా తీసుకొని ఇతర విద్యార్థులు కూడా కృషి చేయాలని సూచించారు.
అలాగే పలువురు సంఘ సభ్యులు హాసినికి అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు పడిగల శ్రీనివాస్, ఏ. కృష్ణ కుమార్, ముక్క శ్యాం, ఎం.ఎస్.ఎన్ మూర్తి, గుడిసె కోటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
