మహారాష్ట్ర ఎన్నికల్లో మహా వికాస్ అగాడి హామీల వర్షాన్ని కురిపిస్తుంది. ఆ హామీలను చూసి మహారాష్ట్రీలే ముక్కున వేలు వేసుకునే పరిస్థితి వచ్చినట్టుగా సమాచారం. ఎన్నికల్లో గెలవడానికి కాంగ్రెస్ ఉద్దేవ్ శివసేన ఎన్సిపి ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తున్నారన్న వాదనలు వస్తున్నాయి. మహా వికాస్ అగాడి ప్రకటించిన ఐదు హామీ లో ఏమంటే రాష్ట్రంలోని మహిళలకు మహాలక్ష్మి పథకం కింద నెలకు రూపాయలు 3000 ఇవ్వడం, ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని రాహుల్ గాంధీ ప్రకటించడం, రైతులకు మూడు లక్షల వరకు రుణమాఫీ ఇస్తామని నిరుద్యోగులకు నెలకు రూపాయలు నాలుగు వేలు ఇస్తామని అలాగే ప్రతి కుటుంబానికి రూపాయలు 25 లక్షల ఆరోగ్య భీమా కల్పిస్తామన్న హామీలు మహా వికాస్ అగాడి ప్రకటించింది. ఓట్ల కోసం సాధ్యం కానీ హామీలు ఇవ్వడం ఎన్నికలు అయిపోయాక చేతులెత్తేయడం కాంగ్రెస్ పార్టీకి అలవాటేనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. గత పార్లమెంటు ఎన్నికల్లో కటకట్ లక్ష రూపాయలు ఇస్తానన్న వాగ్దానం ఏమైందో చెప్పాలన్న వాదన కూడా వస్తున్నది. అలాగే కాంగ్రెస్ పాలిత కర్ణాటక తెలంగాణలో ఇచ్చిన హామీలు అమలుపరిచారా అన్న విమర్శ కూడా ఈ సందర్భంగా వస్తున్నది. ఈ నేపథ్యంలో మహారాష్ట్రన్లు ఎన్నికల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే
