అప్పుల భారంతో కోరుట్లలో వ్యక్తి ఆత్మహత్య
(బాలే అజయ్ – 9290277727 | తెలంగాణ సామ్నా)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో అప్పుల బాధతో ఒక వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన విషాద ఘటన చోటుచేసుకుంది. రాంనగర్‌కు చెందిన వీరమల్లి ప్రసాద్ (48) శుక్రవారం ఉదయం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, ఐదు సంవత్సరాల క్రితం తన కుమార్తె వివాహం నిమిత్తం ప్రసాద్ సుమారు రూ.45 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పులను తీర్చేందుకు తన ఇల్లు కూడా విక్రయించినప్పటికీ పూర్తిగా అప్పులు తీరలేదు. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల ఒత్తిడి కారణంగా తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
ఈ ఘటనపై మృతుడి భార్య వీరమల్లి కావ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్సై చిరంజీవి తెలిపారు.
