35.1 C
Hyderabad
Sunday, June 21, 2026
No menu items!

KTR కు ఈడీ షాక్‌జనవరి 7న విచారణకు రావాలని నోటీసుఅరవింద్‌ కుమార్‌, బెఎల్‌ఎన్‌ రెడ్డిలకు జనవరి 2 మరియు 3 తేదీ

తెలంగాణ సామ్నా: ఈ కారు ఫార్ములా రేసింగ్‌ కేసులో ఈడి కేటిఆర్‌ను తమ విచారణకు హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే ఏసిబి దర్యాప్తు విషయం కోర్టు పరిధిలో క్వాష్‌ పిటషన్‌ స్థాయిలో విచారణ జరుగుతుండగా తాజాగా ఈడీ కేటిఆర్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే ఈడీ ఖచ్చితంగా కేటిఆర్‌ను, అరవింద్‌ కుమార్‌ను, బిఎల్‌ఎన్‌ రెడ్డిలను విచారించే అవకాశం వుందని ముందే చాలా మంది అంచనా వేశారు. మనీ లాండరింగ్‌ జరిగిందని ఏసిబి కేసు ఫైల్‌ చేసి అరెస్ట్‌ కోసం గవర్నర్‌ అనుమతి కూడా తీసుకున్న నేపథ్యంలో ఇక ఈడీ రావడమే తరువాయి అన్నట్లుగా వ్యవహరాలు నడిచాయి.
ఫార్మూలా రేసింగ్‌ కేసులో ఏ1గా కేటిఆర్‌ అరెస్ట్‌కు సంబంధించిన కేసు ప్రస్తుతం హైకోర్టు పరిధిలో వుంది. కేటిఆర్‌ క్వాష్‌ పిటిషన్‌ వేసిన దృష్ట్యా కేటిఆర్‌ అరెస్ట్‌ అవుతారా? లేక కారా? అనే విషయం డిసెంబర్‌ 31న తేలనుంది. ఈ హడావిడి మధ్యలోనే ఈడీ ‘మిడిల్‌ ఎంట్రీ’ ఇచ్చి అదరగొట్టింది.
అటు ఏసిబి వ్యవహరంలోను ఇటు ఈడీ విచారణల మధ్య తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు జనవరి నెలలో వేడేక్కే అవకాశాలు వున్నట్టుగా రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. ఈ వేడిలో కేటిఆర్‌ అరెస్ట్‌ అవుతారా? కారా? అనే విషయమే ప్రజల్లో గొప్పగా చర్చకు వస్తున్నది. ఎసిబి, ఈడీ వర్సెస్‌ కేటిఆర్‌ అన్నట్లుగా ఈ కేసు నడిచే అవకాశం వుంది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles