28.5 C
Hyderabad
Tuesday, November 3, 2026
No menu items!

వీధి కుక్కల దాడిలో బాలుడికి తీవ్ర గాయాలు

ప్రాణాలు పోయాకే మేల్కుంటారా?

కోరుట్ల 21వ వార్డులో బాలుడిపై వీధి కుక్కల దాడి – ముఖం, శరీరంపై తీవ్ర గాయాలు.. భారీగా రక్తస్రావం

బాలే అజయ్ – 9290277727 | కోరుట్ల)

కోరుట్ల పట్టణంలోని 21వ వార్డులో వీధి కుక్కలు ఓ చిన్నారిపై దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. కుక్కలు చిన్నారిని ముఖంపై, శరీరంలోని పలు భాగాల్లో తీవ్రంగా కరవడంతో రక్తస్రావం అధికంగా జరిగినట్లు తెలిసింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

వీధి కుక్కల బెడదపై పట్టణంలోని పలు వార్డుల ప్రజలు ఇప్పటికే మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ, సమస్య పరిష్కారానికి చేపడుతున్న చర్యలు నామమాత్రంగానే ఉంటున్నాయనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలు పలుమార్లు ఫిర్యాదులు చేసినా తూతూమంత్రంగా చర్యలు చేపట్టి వదిలేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

వీధుల్లో గుంపులుగా సంచరిస్తున్న కుక్కల కారణంగా చిన్నారులు, వృద్ధులు, మహిళలు బయటకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు స్పందించి వీధి కుక్కల నియంత్రణకు శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఒక చిన్నారి తీవ్రంగా గాయపడిన తర్వాత కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే, భవిష్యత్తులో మరింత ఘోరమైన ఘటనలు జరిగే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ప్రజల ప్రాణాలకు ముప్పు ఏర్పడిన తర్వాతే మున్సిపల్ యంత్రాంగం మేల్కొంటుందా? మరో చిన్నారి ప్రాణాలు ప్రమాదంలో పడకముందే అధికారులు స్పందించాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles