
(బాలే అజయ్, 9290277727, కోరుట్ల)
కోరుట్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ గా కే. లక్ష్మీనారాయణ శనివారం పదవి బాధ్యతలు చేపట్టారు. కరినగర్ కమిషనరేట్ పరిధిలోని జమ్మికుంట రూరల్ నుండి కోరుట్ల కు ఆయన బదిలీపై వచ్చారు. ఆయన స్థానంలో వున్న సురేష్ బాబు మెట్ పల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా వెళ్ళారు. మెట్ పల్లి సిఐ గా ఉన్న అనిల్ కుమార్ కు పోస్టింగ్ ఇవ్వలేదు. ఐజి కి అటాచ్ చేస్తూ ఉత్తర్వులు విడుదల అయ్యాయి. ఈ నేపథ్యంలో శనివారం కోరుట్ల సిఐ గా లక్ష్మీనారాయణ బాధ్యతలు స్వీకరించారు.
