(బాలే అజయ్ 9290277727)
(తెలంగాణ సామ్నా, కోరుట్ల)
మెట్ పల్లి మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన వివాహిత సోమవారం ఇంట్లో ఉరివేసుకొని చనిపోయినట్టుగా సమాచారం. గ్రామానికి చెందిన ఇల్లెందుల దివ్య అనే 36 సంవత్సరాల వివాహిత సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నట్టుగా తెలుస్తుంది. భర్త ఉదయ్ మెట్పల్లి పట్టణానికి పనిపై వెళ్లగా ఒంటరిగా ఉన్న దివ్య ఉరివేసుకునట్టుగా తెలుస్తున్నది. మృతురాలికి ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఉన్నారు. మృతదేహాన్ని కోరుట్ల ఆసుపత్రికి పోస్టుమార్టం కోసం తరలించినట్టు సమాచారం. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
