
(పిట్ట రాజేష్, తెలంగాణ సామ్నా)
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు జరిగాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన విరబత్తిని దశరథం, రవ్తూ శ్రీకాంత్‌లతో పాటు సుమారు 40 మంది యువకులు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
9వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి గండ్ర శిల్పా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నూతనంగా పార్టీలో చేరిన యువకులకు పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువతే భవిష్యత్తు అని, యువకుల భాగస్వామ్యంతోనే రాష్ట్రం, నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులే యువతను ఆకర్షిస్తున్నాయని నాయకులు పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసం, యువత మద్దతుతో బీఆర్ఎస్ పార్టీ కోరుట్లలో మరింత బలపడుతోందని, రానున్న ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
