(నిన్నటి తరువాయి)
ముప్పదిరెండు సంవత్సరాలుగా పేరుకుపోయిన ఆగ్రహం, ఆయన ఆఖరు ముస్లిం అనుకూల నిరహార దీక్షతో అవధులు దాటి ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా గాంధీజీ పునికి అంతం చేసి తీరవలసినదే అను నిర్ణయమునకు వచ్చునట్లు నన్ను ప్రేరేపించినది. ఆయన భారతమునకు తిరిగి వచ్చిన తరువాత, నన్ను ప్రతి విషయంలో తప్పొప్పులు నిర్ణయించుటలో తానే అంతిమ నిర్ణేత అనేటువంటి అధికారపూరిత మనస్తత్వమును అవవరచుకొనినాడు. దేశము ఆయన నాయకత్వము కోరితే, ఆయన తప్పు అనే దానిని చేయనే చేయడు అని అంగీకరించాలి. అట్లు కోరనిచో ఆయన కాంగ్రెసు నుండి వైదొలగి దూరముగా వుండి తన మార్గములో తన కార్యసరళిని కొనసాగిస్తాడు. ఈ వైఖరికి వ్యతిరేకముగ మధ్యే మార్గమేలేదు. అటు కాంగ్రెస్ తన సంకల్పమును, ఆయన సంకల్పమునకు లోబరచి, ఆయన యొక్క సంయమన రహిత భావాలకు, చపల చిత్తానికి, వేదాంతానికి, చాందస దృక్పథానికి తందాన తాన చెప్పడంతో తృప్తి పడవలెను. లేదా, ఆయన లేకుండా తన కార్యక్రమాన్ని నిర్వహించుకోవలెను.
ప్రతి ఒక్కరిని గురించి ప్రతి విషయమునకు ఆయనే న్యాయ నిర్ణేత సహాయ నిరాకరణ ఉద్యమ మార్గ దర్శనమునకు మహా మేథస్సు ఆయనే, ఆ ఉద్యమ నిర్వహణ నైపుణ్యం ఇంకెవరికి లేదు. దానిని ఎప్పుడు ప్రారంభించవలసినది, ఎప్పుడు ఉపసంహరించవలసినది ఆయనకొక్కడికే తెలుసు. ఉద్యమము సఫలము కావచ్చు, లేదా విఫలము కావచ్చు, అది చెప్పజాలని విపత్తులను, రాజకీయ పరాజయాలను సమకూర్చవచ్చు, కాని ఇవన్ని మహాత్ముని ‘‘తప్పు చేయనే చేయడు’’ అనే విశశ్వాసానికి ఏ మాత్రం కొరత కొనిరావు. ఆయన ‘‘తప్పు చేయనే చేయడు’’ అనే అభిప్రాయమును బలపరచుటకు ‘‘సత్యాగ్రహికి ఎన్నటికి ఓటమి లేదు అనేది ఆయన ప్రవచించిన మూల సూత్రము. కాని సత్యాగ్రహి అంటే ఎవరో ఆయనకు తప్ప ఇంకెవరికి తెలియదు. ఆ విధంగా గాంధీజీ, తాను తెచ్చిన వ్యాజ్యంలో తానే న్యాయవాది, తానే న్యాయనిర్ణేత అయినాడు. ఇటువంటి బాల్య ఆసంబద్ధ క్రియలు, మూర్ఖత్వములు ఆయన క్రమబద్దమైన జీవితము,నిరంతర పరిశ్రమ, సచ్చీలములతో కలసి అడ్డు ఆపులేనివాడైనాడు. గాంధీజీ, చాలమంది ఆయన రాజకీయములు వివేకరహితములని అనుకొనేవారు కాని, వారు కాంగ్రెసు నుండి వైదొలగుటో, లేక తమ తెలివితేటలను ఆయన పాదముల వద్ద సమర్పించుటో చేయవలసి వచ్చేది. అటువంటి అడ్డు ఆపులేని బాధ్యతారహిత స్థితిలో పొరపాటు తర్వాత పొరపాటు, పరాజయము తరువాత పరాజయము, విపత్తు వెంట విపత్తు తెచ్చి నేరములకు ఆయన బాధ్యడైనాడు. ఆయన రాజకీయములలో ప్రముఖ పాత్ర వహించిన 33 సంవత్సరములలో ఒక్క రాజకీయ విజయమును గూడ సాధించియుండలేదు. 32 సంవత్సరములు ఆయన ఎదురులేని నాయకత్వములో వరుసగా జరిగిన ఘోరమైన పొరపాట్లకు కొంత వివరముగా ఈ క్రింద చెప్పుచున్నాను.
(ఇంకా వుంది)
