(నిన్నటి తరువాయి)
- ఈ సమయములోనే ఇంకా కొన్ని విషయములు వెలుగులోకి వచ్చినవి. కొందరు కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర మంత్రులు, వీర సావర్కరును కలసుకొనినారు. కొత్త భారత ప్రభుత్వమును బలపరచుటకు, సావర్కరుచే ప్రతిపాదించబడిన ఐక్యపక్షము నొ కదానిని ఏర్పరచుటకు వారిలో వారికి ఉత్తర ప్రత్యుత్తరములు చురుకుగా సాగినవి. నేను కూడా దేశభక్తులతో కూడపిన ఐక్యపక్షమునకు వ్యతిరేకించి యుండలేదు. కాని కాంగ్రెసు ప్రభుత్వము గొర్రెదాటుగా గాంధీజీకి అణగిమణగి ‘‘భోజనం మానేస్తాను’’ అను ఒక చిన్న అపహాస్యపు బెదిరింపుతో గాంధీజీ భారత ప్రభుత్వముపై తన హిందూ వ్యతిరేక భ్రమలను రుద్దగలిగియుంటే, ఐక్య పక్షమనేది ఒక విధంగా గాంధీజీ నియంతృత్వాన్ని సంస్థాపన చేయడానికి దోహదాం చేసి తీరుతుందని, అందువల్ల హిందూజాతికి నమ్మకద్రోహం జరుగుతుందని నాకు స్పష్టముగా అవగాహన అయినది.
- వీరసావర్కరు తీసుకొన్న ప్రతిచర్యను నేను ఎంత తీవ్రంగా వ్యతిరేకించినానంటే, నేను, ఆప్టే మరికొందరు యువకులైన హిందూ సంఘటనవాదులైనన మిత్రులము కలసి మహాసభతోగాని, ఆ వృద్ధనాకులతో గాని ఏలాంటి సంబంధము లేకుండా, క్రియాశీలమగు పథకము వేసుకొని, ఆ ప్రకారము కార్యక్రమములను నడపుకొనుటకు నిర్ణయించుకొనినాము. మా నూతన పథకములను వీరసావర్కరుకు గానరి వారిలో వరెవ్వరితో గాని వెల్లడిరచరాదని తీర్మానించుకొనినాము.
- నేను, హిందూమమాసభ, దాని వృద్ధ నాయకుల విధానలను నా దినపత్రికలు ‘‘ఆగ్రణి’’ ‘హిందూరాష్ట్ర’ లో విమర్శించడం మొదలు పెట్టినాను. యువతరానికి చెందిన హిందూ సంఘటనావాదులను మా క్రియాశీల కార్యక్రమాన్ని అంగీకరించవలసినదిగా బహిరంగముగ ఉద్భోదించసాగినాను.
- నా నూతన స్వతంత్ర కార్యక్రమాన్ని ఆచరణలో పెటుట్టకు మొదటగా రెండు స్పష్టమైన అంశములను చేపట్టదలచినాను. మొదటిదేమిటంటే, గాంధీజీకి వ్యతిరేకముగ శక్తివంతమైన అయితే శాంతియుతంగా ప్రదర్శనలు వరుసగా ఏర్పాటు చేసి సంఘటితమైన హిందూ అసంతృప్తి మొక్క శక్తిని ఆయనకు తెలసి వచ్చేటట్టు చేయడం, వేటి ద్వారా అయితే ఆయన హిందూ వ్యతిరేక ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడో ఆహేయమై ప్రార్థనా సమావేశాలలలో అసమ్మతి ప్రదర్శనల ద్వారా గందరగోళము, క్రమశిక్షణా రాహిత్యము సృష్టించుట. రెండవది హైదరాబాదు సంస్షాథనములోని మన హిందూ సోదర సోదనీమ/లను, వారిపై మతోన్మాదులైన ముస్లింలు జరుపుచున్న అత్యాచారముల నుండి రక్షించుటకు ఆ సంస్థాన సరిహద్దులలో ఆందోళన లేవదీయుట ఇటువంటి కార్యక్రమములు రహస్యముగను, నియంతృత్వ పద్దతిలోను మాత్రమే కొనసాగించగలము కాబట్ట, వీటిని ఈ కార్యక్రమముల మీద సంపూర్ణ విశ్వాసము వున్న వారికి, మా ఆజ్ఞలను ప్రశ్నించకుండ శిరసాహించగల వారికి మాత్రమే తెలియ నీయవలెనని తీర్మానించుకొనినాము.
(తరువాయి బాగం రేపు)
