(నిన్నటి తరువాయి)
- ఇది జరిగిన తర్వాత కొద్దికాలములోనే, భారతదేశ విభజన నిర్ణయమైపోయిన తరువాత రెండవ ప్రముఖ సంఘటన జరిగినది. భారతదేశంలో మిగలబోయే ‘‘ఇండియన్’’ రాష్ట్రములో ఖాయముగ నేర్పడనునన కాంగ్రెసు ప్రభుత్వ పాలనయెడ మహాసభ వైఖరి ఏ విధంగా వుండవలెనె అనే విషయుమను గూర్తి హిందూ సభలోని ఒక వర్గము తెలియగోరినారు. కండిత బారత దేశములో ఏర్పడబోవు ప్రభుత్వమును ఒక పార్టీ (కాంగ్రెస్) ప్రభుత్వముగ భావించరాదనియు దానిఇన హిందూస్థానపు జాతీయ ప్రభుత్వముగ గుర్తించి మన్నించవలెననియు వీరసావర్కరు, ఇతర ప్రముఖ నాయకులు వెంటనే నొక్కి వక్కానించినారు. పాకిస్థాన్ ఏర్పాటెకు మనము ఎంత వ్యధ చెందినప్పటికి, నూతనముగా ఉద్భవించిన మన స్వతంత్ర భారత రాష్ట్రమునకు విధేయులుగా నుండి సంపూర్ణ సహకారము నిచ్చుటే మన భవిష్యత్ వైఖరిగా నుండవలెను. అట్లున్నప్పుడు కొత్తగా సంపాదించుకొనిన స్వాతంత్య్రమును పరిరక్షించుకొనగలమనియు, భారత ప్రభుత్వమును బలహీనపరచుటకు చేయు ఎట్టి ప్రయత్నమైనా, అంతర్యుద్దమునకు దారితీసి, మొత్తము భారతదేశాన్ని పాకిస్థాన్‌గా మార్చవలెననే పాపపూరిత రహస్య ధ్యేయమును ముస్లింలీగు సాధించుటకు అవకాశము కల్గుననియు వారు అభిప్రాయములను వెలిబుచ్చినారు.
- పై ఆలోచనాసరళి నాకు, నా మిత్రులకు నచ్చకనే తిరిగి వచ్చివేసినాము, వీరసావర్కరు నాయక్తమును వదిలి వేయవలసిన నమయమాసన్నమైనదనియు, మా భవిష్యత్తు పన్నాగములను, కార్యక్రమములను గూర్చి ఆయనతో సంప్రదించుటను ని లిపివేసి పముమ్ముందు ఎత్తు గడలను ఆయనకు తెలుపనైనా తెలుపగూడదని మేము నిశ్చయించుకొనినాము.
(తరువాయి బాగం రేపు)
