24.1 C
Hyderabad
Friday, July 31, 2026
No menu items!

నేరారోపణ పత్రమునకు ప్రతివచనము

‘‘తెలంగాణ సామ్నా వెబ్‌’’ పాఠకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు

Indian flag waving in blue sky

(నిన్నటి తరువాయి)

  1. నేరారోపకులు ప్రవేశపెట్టిన సాక్ష్యము ఎంటువంటి కుట్ర జరిగినట్లు ధృవపరచుట గాని, నిర్ధారణ చేయుటగాని చేయలేదని నేను చెప్పుచున్నాను. న్యాయస్థానము ముందు, ఆరోపించబడిన కుట్ర జరిగినట్లు చెప్పినది ఒకే ఒక సాక్షి. దిగంబర్‌ ఆర్‌.బాడ్గె (ఆరోపకుల సాక్షి 57) నేరారోపకుల సాక్ష్యమును విమర్శచేయుచు, వారి 57వ సాక్షి సాక్ష్యమును గూర్చి వివరించేటప్పుడు, దిగంబర్‌ ఆర్‌. బాడ్గె ఎంతమాత్రము నమ్మదగిన సాక్షి కాడని మా న్యాయవాది మీకు విశదీకరించగలడు.
  2. 1948 జనవరి 20వ తేది నాడు నేను ఆయుధములను ప్రేలుడు పదార్థములను సంపాదించి పంపినట్లు మరియు అట్టి నేరమునకు సహకరించినట్లు చేయబడిన ఆరోపణను నేను నిరాకరించుచున్నాను. నాపౖేె ఆరోపణ చేసి విధముగ గన్‌ కాటన్‌ స్లాబులు, చేతి గ్రెనేడ్లు, డిటోనేటర్లు వత్తులు, పిస్టళ్ళు లేక రివాల్వర్లు, తుపాకీగుండ్లు వంటి ఆయుధములను మందుగుండు సామగ్రిని నేను నా వెంట తీసుకొనిపోయి యుండుట కాని పంచెపెట్టుట గాని చెయ్యలేదు. అట్టి సామగ్రిని నా స్వాధీనములో వుంచుకొని యుండలేదు. ఆ విధముగ చేయుటకు ఇతర నిందితలకు 1948 జనవరి 20 తేదీన గాని మరి ఇతర ఏ దినమున గాని నేను సహాయము చేసియుండలేదు. అందువలన భారత ఆయుధ చట్టములోని, లేక భారత ప్రేలుడు పదార్థముల చట్టములోని నిబంధనలో ఏ ఒక్కదానిని గాని, నేను ఉల్లంఘించలేదు. మరియు ఆ చట్టముల క్రింద శిక్షింపదగిన ఏ నేరమును చేసియుండలేదు.
  3. ఈ ఆరోపణకు సంబంధించినత మటుకు దిగంబర్‌ ఆర్‌బాడ్గె ఇచ్చిన సాక్ష్యము మాత్రమే ముఖ్యమైనది. కాని నేను పైన విన్నవించినట్లు ఇతడు నమ్మదగిన సాక్షిగాడు, ఈ బాడ్గె అను సాక్షి నాకు పరిచితుడే గాని గతించిన అనేక సంవత్సరములుగ అతను నా వద్దకు వచ్చుటగాని నేను అతని వద్దకు పోవుటగాని జరిగియుండలేదు. 1948 జనవరి 10వ తేదిన రెండవ నింనదితుడు ఆప్టేతో బాటు ‘‘హిందురాష్ట్ర’’ కార్యాలయమునకు వచ్చితినని అతను ఇచ్చిన వాంగ్ములము పూర్తిగా అసత్యము. అంతేగాదు ఆయన నన్ను ఆ దినము హిందూ రాష్ట్ర కార్యాలయము వద్ద గాని మరియు ఇతర ప్రదేశములో గాని చూచినట్లు నా సమక్షములో అతను ఆప్టే గన్‌ కాటన్‌ స్లాబులు, చేతి గ్రెనేడ్లు మొదలగు వాని విషయమును, వాటిని బొంబాయికి చేర్చు విషయమును తమలో తాము మాట్లాడుకొనినట్లు చేసిన అబద్ధపు అభియోగములను నేను నిరాకరించుచున్నాను. ఆప్టే నన్ను గదినుండి బయటకి రమ్మని కోరినట్లు, బాడ్గె చేతి గ్రెనేడ్లు వగైరా చేకూర్చుటకు సంసిద్దుడుగా వున్నందున ఒక పని పూర్తి అయినట్లే అని ఆప్టే నాతో చెప్పిట్లు అతను ఇచ్చిన వాంగ్ములం పూర్తిగా అబద్దమైయున్నది. ఇది అంతా నన్ను, ఇతర నిందితులను ఆరోపణ చేయబడిన కుట్ర నేరములో ఇరికించుటకు బాడ్గె అల్లిన కట్టుకథ మాత్రమే. ఇంకా 1948 జనవరి 14వ తేది నేను ఒంటరిగ గాని ఆప్టేతో కలసి గాని దాదరులో బాడ్గెను చూచుటగాని, కలుసుకొనుటగాని జరుగలేదని గట్టిగా చెప్పుచున్నాను. బాడ్గె ఆ దినము బొంబాయికి వచ్చనాడను విషయము కూడా నాకు తెలియదు

(తరువాయి బాగం రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles