29.2 C
Hyderabad
Friday, September 18, 2026
No menu items!

వాంగ్మూలం

నిన్నటి తరువాయి…
సావర్కరుపై బ్రిటిష్‌ రాజద్రోహ నేరమారోపింపబడి రెండు అజీవన ద్వీపాంతరవాసములు అదీ వింత గొల్పునట్లు ఒక శిక్ష తర్వాత మరియొకటి అనుభవించునట్లు విధింపబడినది. అది 1910లో జరిగనది. అతనిపై విధింపబడిన అన్ని నిర్భందముల నుండి 1937 తర్వాత మాత్రమే విముక్తి పొందినాడు.
సావర్కరు నిర్భంధ విముక్తుడగునప్పటికి ముస్లింలను బుజ్జగించు విధానములో కాంగ్రెసు చాలా ముందుకు సాగిపోయింది.
సావర్కరును ప్రజలు ‘‘స్వాతంత్య్ర వీర్‌’’ స్వాతంత్య్ర సముపార్జనలో ముందు నిలచిన యోధుడు అను బిరుదు నిచ్చి గౌరవంచినారు. ఆయన తిరిగి రాజకీయములలో ప్రవేశించి హిందువులకు న్యాయముగ రావలసిన గౌరవనీయమైన స్థానమును ప్రతిష్ఠను చేకూర్చి, స్వాతంత్య్రమునకై పాటుపడు చుండిన రాజకీయపక్షమైన హిందు మహాసభ నాయకత్వమును స్వీకరించినారు.
విభజన లేకుండా దేశ స్వాతంత్య్ర సాధనకై వారు పట్టుదల వహించినారు. దేశ విభజన లేకుండా చేయుటకు ముస్లిలను బుజ్జగించు విధానమును విడనాడవలెనని ప్రజలను ఉద్భోదించినారు. ఆయుధముల నుపయోగించుట నేర్చుకొనుటకు అరుదైన అవకాశముగా బ్రిటిష్‌వారి క్రిందనైనా సరే, సైన్యములో చేరమని హిందువులను ప్రోత్సాహపరచినారు. స్వాతర్రత్య సముపార్జనలో సమయము వచ్చినప్పుడు ఆయుధముల నుపయోగించుటకు సన్నద్ధము కావలసినదిగా యువకుల నుద్భోదించినారు. వీర సావర్కరు విప్లవ భావాలు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌కు స్పూర్తిదాయకములైనవి. తర్వాత బ్రిటిష్‌పాలనను తుదముట్టించుటకు సుభాష్‌ చంద్రబోసు తీసుకొనవలసిన పైనిక చర్యల పథకములను తయారు చేయుటకు వారిరువురు కలుసుకొని రహస్యముగా సంభాషణలు జరిపిన విషయము చాలా కొద్ది మందికి మాత్రమే తెలియును. దేశం నుండి బహిష్క్ర్రుతుడై జపాన్‌లో ప్రవాసితుడై అచ్చట హిందూసభ అధ్యక్షుడుగా నుండిన విప్లవకారుడు రాప్‌ాబిహారి బోసు దేశాంతరములలో ఉన్నప్పటికి ఆయనతో వీరసావర్కరు ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుచుండుట కూడా చాలా కొద్ది మంది మాత్రమే తెలిసిన విషయము.
దేశములో ప్రముఖ రాజకీయ పక్షమైన ఇండియన్‌ నేషనల్‌ కాంగ్రెస్‌ ప్రజలను మోసగిస్తున్నదని, ముస్లింలను బుజ్జగించి తృప్తి పరచుటకుగాను దేశాన్ని విభజిస్తుందని, అంతేగాదు ఆతర్వాత మిగతా భారతదేశములోని ముస్లింల భావాలను సంతృప్తి పరచేందుకు ప్రయత్నిస్తుందని దేశ విభజన జరుగుటకు కొన్ని సంవత్సరములు ముందుగానే వీర సావర్కరు హెచ్చరించినారు. మిగితా భారతదేశంలో ముస్లిం సంతుష్టీకరణ విధానము హిందువుల చట్ట సమ్మతమై హక్కులకు భంగకరంగా వుంటుందని కూడా హెచ్చరించినారు.
(తరువాయి బాగం రేపు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles