37.2 C
Hyderabad
Monday, April 20, 2026
No menu items!

డిఫాల్టర్‌ రైస్‌ మిల్లర్లకు తిరిగి ధాన్యం కేటాయిస్తున్న టిజి ప్రభుత్వం

తెలంగాణ సామ్న: తెలంగాణ ప్రభుత్వం గతంలో గొప్పగా చెప్పుకున్న డిఫాల్ట్‌ర్లకు ధాన్యం సరఫరా చేయమన్న మాటకు వెనక్కి తీసుకున్నట్లుగా సమాచారం. ఎట్టి పరిస్థితుల్లో డిఫాల్టర్లకుధాన్యం కేటాయించమని చెప్పి పట్టుమని పది నెలలు కూడా కాని పరిస్థితిల్లో మంగళవారం ప్రభుత్వం జిఓ నం.57 జారీ చేసింది. గతంలో కేటాయించిన ధాన్యాన్ని నూటికి నూరు శాతం మిల్లర్లు ప్రభుత్వానికి అందించకపోతే 25శాతం భారీ జరిమానా విధించిన సంగతి తెలిసిందే.

ఇలా చెల్లించని వారిని డిఫాల్టర్ల జాబితాలో ప్రభుత్వం చేర్చి వారికి ధాన్యం సరఫరా నిలిపివేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించింది. అయితే తెలంగాణలోని చాలా మిల్లులు రాజకీయనాయకుల కనుసన్నల్లో వున్నాయన్న ఆరోపణల నేపథ్యంతో పాటు మిల్లర్ల సంఘం పెద్ద ఎత్తున లాబీయింగ్‌ చేయడంతో ప్రభుత్వం కొత్త మెత్తబడినట్లు తెలుస్తున్నది. కొత్త నిబంధనల ప్రకారం జరిమానాగా వేసిన 25 శాతంలో సగం వెంటనే చెల్లించాలని సూచించినట్లు తెలుస్తున్నది. మిగిలిన సగాన్ని నెలాఖరు వరకు ఇచ్చేయాలని అదేశాలు ఇచ్చారు. కొత్త ధాన్యం సేకరణ పద్ధతి ప్రకారం 25శాతం బ్యాంకు గ్యారంటీ గాని సెక్యూరిటీ డిపాజిట్‌ రూపంలో కాని ప్రభుత్వానికి ఇవ్వాల్సి వుంటుంది. మొత్తానికి ప్రభుత్వానికి తమకు అనుకూలంగా మలుచుకున్నామన్న ధీమాతో రైస్‌ మిల్లర్లు ఉత్సాహంగా వున్నట్లు సమాచారం.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected
603FansLike
0FollowersFollow
0FollowersFollow
2SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles