బారాస కార్యనిర్వాక అధ్యక్షుడు కల్వకుంట్ల తారక రామారావు బంధువు, రాజ్ పాకాలకు మొకిల పోలీసులు నోటీసులు జారీ చేశారు. జన్వాడ ఫామ్ హౌస్ లో చేసుకున్న పార్టీకి సంబంధించిన నోటీసులను వారు ఆయనకు చెందిన భవనానికి నోటీసులు అంటించినట్లు తెలుస్తుంది. రాజు పాకాల కు సంబంధించిన ఫామ్ హౌస్ లో విదేశీ మద్యం బాటిలను పోలీసులు స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో సోమవారం విచారణకు రావాలని పోలీసులు నోటీసులో పేర్కొన్నట్టు తెలుస్తుంది.
