జగిత్యాల జిల్లాలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని శనివారం ఉదయం జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన జిల్లా కలెక్టర్ కు అధికారులు అర్చకులు, పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్వామి వారి సన్నిధిలో వారి గోత్ర నామాలతో అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదనంతరం ఆలయ ఈవో శ్రీనివాస్ స్వామి వారి శేష వస్త్రంతో కలెక్టర్ ను సత్కరించి ప్రసాదాలు అందజేశారు.
