మంత్రి కొండా సురేఖను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు మందలించింది. శుక్రవారం కేటీఆర్ వేసిన పరువు నష్టం దావాను కోర్టు విచారించిన నేపథ్యంలో కొండా సురేఖను కోర్టు చివాట్టు పెట్టినట్లు సమాచారం. ఒక బాధ్యతగల పదవిలో ఉండి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ కోర్టు మందలించింది. ఇలాంటి వాక్యాలు కేటీఆర్ పై మరోసారి చేయొద్దని హెచ్చరించింది. ఒక ప్రజాప్రతినిధిగా మంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తీవ్ర అభ్యంతరకరమని కోర్టు పేర్కొంది. సురేఖ వ్యాఖ్యలకు సంబంధించి పోస్టులను సోషల్ మీడియా నుంచి తొలగించాలని కోర్టు ఆదేశించింది.
