కాంగ్రెస్లో చేరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలను వారి పనితీరును గమనిస్తున్నామని కాంగ్రెస్ మాజీ ఎంపీ సీనియర్ నాయకులు తెలిపారు. జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ గారి అనుచరుడు గంగారెడ్డి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని ఆయన ఆరోపించారు. ఈ విషయంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. తన ప్రాణానికి ముప్పు ఉందని గంగారెడ్డి ఫిర్యాదు చేసిన పోలీసులు భద్రత ఇవ్వకపోవడం కాక పాత కక్షలు అంటూ తేలిగ్గా తీసుకున్నారని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్లో చేరిన టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్పై ప్రేమతో పార్టీలోకి రాలేదని ఆయన అన్నారు.
