
తెలంగాణ సామ్న: ఓ చానల్ జర్నలిస్టుపై దాడి చేసిన కేసులో సినీనటుడు మోహన్‌బాబుకు పోలీసులు మరోసారి నోటీసులు ఇవ్వనున్నట్లు సమాచారం అందుతోంది. మోహన్‌బాబు బుధవారం వరకు కూడా అజ్ఞాతం వీడని దృష్ట్యా పోలీసులు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. అరెస్ట్ నుండి మినహయింపు కోరుతూ వేసిన పిటిషన్‌కు స్పందించిన హైకోర్టు మంగళవారం వరకు గడువు ఇచ్చిన సంగతి తెలిసినదే. గడువు సమయం ముగిసినా మోహన్‌బాబు పోలీసుల విచారణకు హజరు కాకపోవడంతో ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చే అవకాశం వున్నట్లు తెలుస్తున్నది. అయితే మోహన్‌బాబుపై చట్ట పరమైన చర్యలు తప్పకుండా తీసుకుంటామని పోలీసులు పెర్కోంటున్నారు.

dhanyavadh