హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియం వద్ద టీజీపీఎస్ కానిస్టేబుల్స్ సోమవారం ఆందోళనకు దిగారు. ఒకే రాష్ట్రం ఒకే పోలీసు విధానం కోసం ధర్నాలు సమ్మె చేసిన 39 మంది కానిస్టేబుల్ లను సస్పెండ్ చేయడంతో పాటు పదిమందిని ఉద్యోగం నుంచి తొలగించడంపై వారు నిరసన వ్యక్తం చేశారు. సచివాలయ ముట్టడికి పిలుపునిచ్చిన వారిని పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అరెస్టు చేశారు. పరిష్కారం కానీ తమ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి డిజిపి జితేందర్ చర్చించి తగు న్యాయం చేయాలని కానిస్టేబుల్ డిమాండ్ చేశారు
