(వాసం మృత్యుంజయ, భాగ్యనగర్ సెంట్రల్ డెస్క్)
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన పెన్షన్ అర్హత లబ్ధిదారుల పరిశీలనలో మొత్తం 1.28 లక్షల పెన్షన్లు రద్దు చేసినట్లు అధికారులు వెల్లడించారు
రద్దైన పెన్షన్లలో
మృతి చెందిన వారు,
వలస వెళ్లినవారు,
ప్రభుత్వ ఉద్యోగుల తల్లితండ్రులు,
5 ఎకరాలకు పైగా భూమి కలిగినవారు
ట్యాక్స్ చెల్లింపుదారులు ఉన్నట్టు ఒక ప్రకటనలో అధికారులు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో: 1.02 లక్షలు,
మున్సిపాలిటీల్లో: సుమారు 26 వేల మందినీ తొలిగించినట్టు తెలిపారు. అదే సమయంలో సామాజిక భద్రత పథకాల కింద కొత్త లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తూ 48 వేల మంది వికలాంగులు, వితంతువుల జాబితాను అధికారులు సిద్ధం చేశారు.
అర్హులైన వారికి త్వరలో కొత్త పెన్షన్లు మంజూరు అయ్యే అవకాశం ఉంది.
